- ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి విధిగా వ్యాయామలు చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టెలికంనగర్ కాలనీ పార్క్ లో రూ. 18 లక్షల అంచనావ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ సాయిబాబా తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ టెలికం నగర్ కాలనీలో ఓపెన్ జిమ్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. అందరూ విరివిగా మొక్కలు నాటి పార్కులను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు. రాబోయే రోజులలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మరిన్ని కాలనీలలో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేసి, ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించే దిశగా అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతున్నదని తెలిపారు. ఆరోగ్యం బాగుంటే మనిషి ఏదైనా సాధించగలడని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, తెరాస నాయకులు చెన్నం రాజు, శ్రీను పటేల్ సత్యనారాయణ, నరేష్, రాగం జంగయ్య యాదవ్, సురేందర్, సతీష్ ముదిరాజ్, అంజమ్మ, శంకరి రాజు ముదిరాజ్, రాచులూరి జగదీశ్, రమేష్ గౌడ్, నారాయణ, గోవింద్, శామ్లెట్ శ్రీనివాస్, సుధీర్, సుగుణ, బాలమణి పాల్గొన్నారు.
