ట్రాఫిక్ సమస్య కు శాశ్వత పరిష్కారం జీవో 195

  • మంత్రి కేటీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యేలు

నమస్తే శేరిలింగంపల్లి: HMDA ఆధ్వర్యంలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులకు ప్రత్యేక జీవో నెంబర్ 195 ద్వారా రూ.135 కోట్లు మంజూరు చేసినందుకు మంత్రి, తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ప్రగతి భవన్ లో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కె.పి. వివేకానందతో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మియాపూర్ X రోడ్డు నుండి భౌరంపేట్ మీదుగా గండిమైసమ్మ వరకు HMDA ఆధ్వర్యంలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులకు ప్రత్యేక జీవో నెంబర్ 195 ద్వారా రూ.135 కోట్లు మంజూరు చేసినందుకు మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపామన్నారు. రోడ్డు విస్తరణ వలన ఏండ్ల తరబడి ట్రాఫిక్ సమస్య కు శాశ్వత పరిష్కారం లభించనుందని చెప్పారు. అదేవిధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి లో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజి, తాగునీటి సమస్యల పరిష్కారానికి, నూతన రోడ్లకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ మంత్రి కేటీఆర్ దృష్టికి తేవడంతో తీసుకురాగా .. ఆయన సానుకూలంగా స్పందించి మాట్లాడారు. వచ్చే బుధవారం సంబంధిత విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామని, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తామని ఈ సందర్బంగా మంత్రి తెలిపారు.

మంత్రి కేటీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న అరెకపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కె.పి. వివేకానంద

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here