- జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దగ్గరుండి మరమ్మతులు చేయించిన కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో గత 20 రోజులుగా వీధిలైట్లు వెలగకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ జిహెచ్ఎంసి సిబ్బందికి తెలియజేయడంతో జీహెచ్ఎంసీ ఏఈ రాజశేఖర్, సూజర్ వైజర్ వనిత సత్వరమే స్పందించారు.
స్పందించి తమ సిబ్బంది పవన్, రాజు, ప్రశాంత్ లను పంపించి వీధిలైట్ల మరమ్మతుకు తగు చర్యలు తీసుకున్నారు. చాలా రోజులుగా ఉన్న ఈ సమస్యను కాలనీ అధ్యక్షులు జిహెచ్ఎంసి సిబ్బందితో దగ్గరుండి మరీ వీధిలైట్ల మరమ్మతులు చేయించారు. వీధిలైట్లు వెలగడంతో కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.