-చందానగర్ డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించాలంటూ వినతి
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ లోకేష్ కుమార్ లకు కార్పొరేటర్ బొబ్బనవత రెడ్డి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కైలాష్ నగర్ కాలనీ లో ఉన్న 4000 గజాల గల సర్వే నెంబర్ 210 ఓపెన్ ల్యాండ్ లో మినీ స్టేడియం నిర్మించాలని, GHMC అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ని రిపేర్ చేయాలని, ఇండియన్ గ్యాస్ కంపెనీ వద్ద ఉన్న వంతెనను రోడ్ వెడల్పు చేసి నిర్మించాలని, అదేవిధంగా డివిజన్ లోని వివిధ కాలనీ, బస్తిలలో సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేసి, డివిజన్ అభివృద్ధికి సహకరించాలని కొరారు. కాగ మేయర్, కమిషనర్ లు సానుకూలంగా స్పందించినట్లు కార్పొరేటర్ నవత రెడ్డి తెలిపారు.