మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): డివిజన్ పరిధిలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రాప్ టు కిచెన్ హోల్ సేల్ పండ్ల మరియు కూరగాయల మార్కెట్ ను టిడబ్ల్యుఆర్డీసి చైర్మెన్ వి ప్రకాష్ రావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ క్రాప్ టు కిచెన్ కూరగాయలు, పండ్లు షాప్ ఇక్కడ ప్రారంభించడం చాల సంతోషకరమైన విషయమని, ఇక్కడి ప్రాంత వాసులకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది అని పేర్కొన్నారు. వియోగదారుల అభిరుచికి తగ్గట్టు రుచికరమైన, నాణ్యమైన కూరగాయలు, పండ్లు అందచేసి వారి మన్ననలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, తెరాస నాయకులు రాంచందర్, సైదేశ్వర్, సత్యరెడ్డి,సాయి తదితరులు పాల్గొన్నారు.