నమస్తే శేరిలింగంపల్లి: హాఫిజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు నుంచి దీప్తిశ్రీ నగర్ నాలా వరకు (వయా జాతీయ రహదారి NH 65 వరకు ) రూ.15.88 పదిహేను కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల అంచనా వ్యయం తో 2.4 కి.మీ మేర చేపడుతున్న నాల విస్తరణ పనులలో భాగంగా మంజీర పైప్ లైన్ రోడ్డు వద్ద జరుగుతున్న నాల విస్తరణ పనులను కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముంపునకు శాశ్వత పరిష్కారం దిశగా నాల విస్తరణ పనులు చేపట్టామని, ఇక ముంపు సమస్య ఉండదని, ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరునని, వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అసంపూర్తిగా మిగిలిపోయిన నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని, నాల విస్తరణ పై ప్రణాళికలు రూపొందించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. కరోనా వంటి విపతర్క పరిస్ధితుల్లో అభివృద్ధి, సంక్షేమం అగకూడదనే ఉదేశ్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చేస్తున్నామని, పేర్కొన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుడదని పనుల లో వేగం పెంచాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్ పేట్
డివిజన్ అధ్యక్షుడు వాలా హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, సంగారెడ్డి, అన్వర్ షరీఫ్, వెంకటేశ్వర్ రావు, దామోదర్ రెడ్డి, గౌస్, కరీం పాల్గొన్నారు.