నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నెల రోజుల ఉపవాస దీక్షలు ముగియడంతో ముస్లింలు ఉదయాన్నే అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ముస్లీంలతో పాటు ప్రజాప్రతినిధులు, ఈద్గాల వద్ద పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని హాఫీజ్ పేట్/మాదాపూర్/అల్విన్ కాలనీ డివిజన్ మైనారిటీ సోదరులను శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్, ఎం.బి.సి చైర్మన్ జేరిపాటి జైపాల్ వారి నివాసంలో కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ గౌడ్, కనకమామిడి నరేందర్ గౌడ్, జామీర్, సయ్యద్ తహెర్ హుస్సేన్, మనెపల్లి సాంబశివరావు, ప్రభాకర్, రెహ్మాన్, మరేళ్ల శ్రీనివాస్, పట్వారీ శశిధర్, శిరీష సత్తుర్, సుదర్శన్, మూర్తి, అశోక్ గౌడ్, రవి, రాజా, మాజర్ ఇతర నాయకులు ఉన్నారు.