19 వ రోజు సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ న్యూ కాలనీలో సందయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ బిక్షపతి యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం పరీక్షలు నిర్వహించి దాదాపు 500 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటూ వారిని రోజు రోజుకు మరింతగా దిగజారుస్తున్నారని అన్నారు.
సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ధ్యేయం ఒక్కటే, అందరికీ విద్య, అందరికీ వైద్యం అందించడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తుందని ట్రస్ట్ చైర్మన్ బిక్షపతి యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వినోద్ రావు, నాగులు గౌడ్, నవతారెడ్డి , మాణిక్ రావు, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, శ్రీధర్ గౌడ్, మహేష్ ముదిరాజ్, నరసింహ రాజు, రాజేష్ గౌడ్, పవన్ యాదవ్, సురేష్ ముదిరాజ్ విజయేందర్, సురేష్ గౌడ్, శ్రావణ్, అంజయ్య, డేవిడ్, చందు, తిరుపతి, మంజుల పాల్గొన్నారు.