- అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు
నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో నిర్వహిస్తున్న “గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్సవ్” చేనేత హస్తకళా ఉత్పత్తులు చూపరులను కట్టిపడేస్తున్నవి. బాందిని చీరలు, డ్రెస్ మెటీరియల్స్, మడ్ ఆర్ట్ వర్క్ , పటోళ్ల చీరలు, అద్దాలతో తయారు చేసిన డెకొరేటివ్ వస్తువులు, లిప్పన్ ఆర్ట్, గుజరాతి శాలువాలు, గుజరాతి అద్దాల డ్రెస్సులు ఎన్నో మరెన్నో మహిళలను ఆకట్టుకుంటున్నవి.
ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కుమారి తేజస్వి కొండూరి భరతనాట్య ప్రదర్శన, గుజరాతి రస గర్భ నృత్యాలు, గురువర్యులు రాధా మోహన్ తన శిష్య బృందంతో “రాధా మోహనం” శ్రీకృష్ణుడి బాల్య లీల, యుక్తవయసు రాధా గోపికల తో రాసలీలలు , రాధా కృష్ణుల ప్రేమామృత విలువల గురించి భరతనాట్య నృత్య పద్ధతిలో కళాకారులూ చక్కగా ప్రదర్శించి మెప్పించారు.