నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్, మాదీనగూడా గాంధీ విగ్రహం దగ్గర విభజన ఉన్మాద సంస్మరణ దినం నిర్వహించారు. ఈ సందర్బంగా మౌన ప్రదర్శన, ర్యాలీ చేపట్టారు. దేశ విభజన సృష్టించిన భయానిక పరిస్థితులల్లో మాన, ప్రాణ, సర్వం, కోల్పోయిన నాటి బాధితులకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ నివాళులర్పించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ అహంకార పెత్తనానికి, కాంగ్రెస్ బానిస మానసత్వానికి సంకేతంగా నిలిచిన చీకటి రోజు ఈరోజు, అఖండ భారతాన్ని ముక్కలు చేసిన విభజన ఉన్మాదానికి బలైన 50 లక్షల భారతీయులు, ఇది ఆధునిక మానవ చరిత్రలో మర్చిపోలేని ప్రాణ వినాశన దుర్ఘటన అని తెలిపారు. కార్యక్రమంలో కొరదాల నరేష్, రాఘవేంద్రరావు, బుచ్చి రెడ్డి, మాణిక్ రావు, మనోహర్, బోయిని మహేష్ యాదవ్, విజయలక్ష్మి, దుర్గప్రసాద్, జగన్ గౌడ్, చంద్ర మోహన్, పవన్, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.