- లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మిత్ర శేరిలింగంపల్లి ఫౌండర్ చైర్మన్ లయన్ సి. యాదగిరి గౌడ్ పుట్టిన రోజు సందర్బంగా పలు సేవ కార్యక్రమాలు
నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మిత్ర శేరిలింగంపల్లి ఫౌండర్ చైర్మన్ లయన్ సి. యాదగిరి గౌడ్ ఎంజేఎఫ్ పుట్టినరోజును అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మిత్ర ఆధ్వర్యంలో పలు సేవ కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇంద్రేశం వద్ద మదర్ మేరీ ఓల్డ్ ఏజ్ హోమ్ లో అన్నదాన నిర్వహించారు. ఈ సందర్బంగా అన్నదానానికి వచ్చిన వృద్దులు, ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ జరుపుకోవాలంటూ యాదగిరి గౌడ్ దీవెనలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఎల్ఎన్ సత్యనారాయణ గౌడ్, ఎల్ఎన్ రమణ, ఎల్ఎన్ బచ్చు రాజు, ఎల్ఎన్ ధనుంజయరావు, ఎల్ఎన్ శ్రీనివాస్ నాయక్, ఎల్ఎన్ శ్రీనివాస్ గౌడ్, ఎల్ఎన్ జేవీకే ప్రసాద్, ఎల్ఎన్ శ్రీనివాస్ గౌడ్, ఎల్ఎన్ శివశంకర్, ఎల్ఎన్ రామస్వామి గౌడ్ పాల్గొన్నారు.