విద్యాసంస్థల బంద్ విజయవంతం

– మంత్రుల నివాసాలు ముట్టడి, విద్యార్ధి నాయకులపై పోలీసులు లాఠీచార్జీ, అక్రమ అరెస్టులు.
– పలు జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం, అరెస్టులు
– ఖమ్మం జిల్లాలో విద్యార్థి సంఘాలపై ఢిల్లీ యాజమాన్యం దాడి
– వామపక్ష విద్యార్ధి సంఘాల బంద్ లో అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు

నమస్తే శేరిలింగంపల్లి: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ విజయవంతం అయ్యింది. హైదరాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, హన్మకొండ, ఖమ్మం,నిజామాబాద్ జిల్లాలో పోలీసులు అత్యుహ్సం ప్రదర్శించి శాంతియుతంగా బంద్ చేస్తున్న విద్యార్ధులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాష్ట్ర కేంద్రంలో వామపక్ష విద్యార్ధి సంఘాలు రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో మంత్రుల నివాస సముదాయాలను ముట్టడికీ ప్రయత్నించిన విద్యార్ధి సంఘాల నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేసి గాయపర్చారు. బూతులు తిడుతూ అమ్మాయిలు కూడా లాగి బలవంతంగా అరెస్ట్ చేశారు. అంతకు ముందు విరించి హస్పిటల్ సిగ్నల్ నుండి ర్యాలీగా చేరుకున్న విద్యార్ధులపై పోలీసులు ఒక్కసారిగా పిడిగుద్దులు గుద్దుతూ దాడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు నాయకులు ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు(ఎస్ఎఫ్ఐ), పుట్టా లక్ష్మణ్(ఎఐఎస్ఎఫ్), పరుశురాం (పి.డి.ఎస్.యు), ఎస్.నాగేశ్వరరావు, రామకృష్ణ( పి.డి.ఎస్.యు), మహేష్(పి.డి.ఎస్.యు), మల్లేష్(ఎ.ఐ..డి.ఎస్.ఓ), గవ్వ వంశీధర్ రెడ్డి(ఎ.ఐ.ఎస్.బి.), మురళీ(ఎ.ఐ.ఎఫ్.డి.ఎస్.), విజయ్(పి.డి.ఎస్.యు.(వి) లు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం సక్రమంగా పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు, హస్టల్స్, గురుకులాలకు నోట్ పుస్తకాలు ఇవ్వలేదు, సోంత భవనాలు లేకుండా గురుకులాలు చాలి, చాలని సౌకర్యాలతో అద్దె భవనాల్లో నడుస్తున్నాయని అన్నారు.

నాణ్యమైన భోజనం అందిచట్లేదని, కెజిబివిలు, మోడల్ స్కూల్స్ టీచర్స్ లేరని, రాష్ట్రంలో 24 వేల టీచర్స్ ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయడంలేదని అన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రంలో బంద్ మాత్రమే కాకుండా రానున్న కాలంలో వామపక్ష విద్యార్ధి సంఘాలు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులుకు, విద్యార్థులకు తీవ్ర తోపులాట జరిగింది. లాఠీలతో విద్యార్థులను కోడుతూ చోక్కాలు చించి దాడి చేసి మరి బలవంతపు అరెస్టులు చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో బంద్ పాటించాలని కోరిన వామపక్ష విద్యార్ధి సంఘాలు నాయకత్వం పై ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం బౌన్సర్లు పెట్టి దాడి చేయించింది. ఈ దాడిని విద్యార్ధి సంఘాలు రాష్ట్ర కమిటీలు ఖండిస్తున్నాయి. రేపు అరెస్టులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కు పిలుపునిస్తున్నట్లు విద్యార్ధి సంఘాలు ప్రకటిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో తాటికొండ రవి, బి.శంకర్, కె.అశోక్ రెడ్డి ,లెనిన్,రమేష్, స్టాలిన్, శ్రీమాన్,(ఎస్ఎఫ్ఐ), క్రాంతి గ్యార, రెహామాన్,హరీష్, అన్వర్, తిరుపతి( ఎ.ఐ.ఎస్.ఎఫ్), గణేష్, నాగరాజు, సైదులు, యశ్వంత్ (పి.డి.ఎస్.యు),గడ్డం శ్యామ్, గణేష్, గౌతమ్, ఆసిఫ్(పి.డి.ఎస్.యు), రాజు, అరవింద్ రెడ్డి, అఖిల్ ,అవినాష్(ఎ.ఐ.ఎస్.బి), ప్రతిభ, వెంకటేష్, సృజన్, ఉషాశ్రీ(ఎ.ఐ.డి.ఎస్.ఓ),అనిల్, సుమంత్, పవిత్ర, తిరుపతి,పాషా(పి.డి.ఎస్.యు),భాను, నవీన్,సాయి(ఎ.ఐ.ఎఫ్.డి.ఎస్) తదితరులు విద్యార్ధి నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here