నమస్తే శేరిలింగంపల్లి: తాగునీటి కోసం ఇందిరా నగర్ ప్రజలు ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. వీరు పడుతున్న ఇబ్బందులకు, తాగునీటి కొరతకు చెక్ పెట్టేందుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెరిపెటి జైపాల్ ముందుకు వచ్చారు. నేను ఉన్నానంటూ భరోసా కల్పించారు. తాగునీరు లేక అల్లాడుతున్న వారికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయించారు. . ఈ సందర్బంగా స్థానికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.