నమస్తే శేరిలింగంపల్లి : వినాయకచవితి పర్వదినంను పురస్కరించుకుని మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గాంధీ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, రోజాదేవి రంగరావు, మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి ప్రజలకు, కాలనీ వాసులకు వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని, మట్టి వినాయకుల ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని, చెరువులను కలుషితం చేయకుండా వీలైనంత వరకు మట్టి వినాయకులను తమ తమ ఇండ్ల వద్దే నిమజ్జనం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ ప్రతినిధులు, ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.