- నాయకులు, కార్యకర్తలను అభినందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మహిళనాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని వారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారిని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. ప్రజాస్వామ్యంతో అత్యంత కీలకమైన ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకున్న నియోజకవర్గ ఓటర్లతోపాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు బీఆర్‌ఎస్ అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన స్వల్ప కాలంలోనే పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పటికీ తనకు అఖండ మెజార్టీ అందించటమే కాకుండా.. బీఆర్‌ఎస్ చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకోసం నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు తామే అభ్యర్థిలా భావించి అలుపెరగకుండా శ్రమించారని అభినందించారు. సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లటంలో, ఓటర్లను చైతన్య పరచటంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల కృషి స్తూర్తి దాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మహిళ నాయకురాలు మంజుల, స్వప్న, బీజాన్ బీ, SK బీబీ, గణిత, సరస్వతి, రమాదేవి, చంద్రకళ, లక్ష్మమ్మ, లక్ష్మీ, రాణి, నీలా, లావణ్య, నిర్మల, లత, భారతమ్మ, లక్ష్మీదేవి, లలితమ్మ, చంద్రకళ, దుర్గాభవాని, స్వరూప పాల్గొన్నారు.