- ప్రచారంలో బాలింగ్ లక్ష్మి గౌతమ్ గౌడ్ దంపతులు
నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీని గెలిపించాలని బాలింగ్ లక్ష్మి గౌతమ్ గౌడ్ దంపతులు హఫీజ్ పేట్ 109 డివిజన్ లో ఇంటి ఇంటి ప్రచారం చేపట్టారు. స్థానిక డివిజన్ పరిధిలో గంగారం విలేజ్, సుభాష్ నగర్ లో గడప గడప ప్రచార పాదయాత్ర చేపట్టారు.
బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అత్యదిక మెజారిటీ తో గెలిపించమని బాలింగ్ లక్ష్మి గౌతమ్ గౌడ్ దంపతులు ఇద్దరూ కలిసి ప్రతి కడపకు వెళ్లి ఓటు అభ్యర్థించారు. ప్రజల నుండి వస్తున్న స్పందన తమకి ఎంతగానో తృప్తిని ఇస్తుందనీ, ఎమ్మెల్యే గాంధీ భారీ మెజారిటీతో ముచ్చటగా మూడో సారి కైవసం చేసుకోడం తధ్యం అన్నారు.
ఈ ప్రచార యాత్రను విజయవంతం చేసిన ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకి లక్ష్మరెడ్డి, సుప్రజ ప్రవీణ్ , ఊరిటి వెంకట్ రావు, వాల హరీష్, మనోహర్ గౌడ్, అక్తర్, మల్ల రెడ్డి, రామకృష్ణ గౌడ్, ధాత్రి గౌడ్, వెంకటేష్ గౌడ్, సాదిక్, శ్రీనివాస్ గౌడ్, శేఖర్ గౌడ్, బబ్లూ, సాబేర్, వినోద్ కుమార్, రాజు, గ్యాని, జామీర్, శేకర్ పాల్గొన్నారు.