- మరో లడ్డు లక్కీ లాటరీలో దక్కించుకున్న ఆర్ఎల్పి వెంకటేష్ పటెల్
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మండపాలలో కొలువుదీరిన గణనాధులకు ఎమ్మెల్యే నుంచి మొదలుకొని కార్పొరేటర్లు పలు పార్టీల నేతలు, పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. నిమజ్జనానికి తరలుతున్న గణనాధుల ను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండగా వారికి ఆయా మండపాల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
జై బోలో గణేష్ మహారాజ్ కీ జై.. గణపతి బప్పా మోరియా.. అంటూ భక్తులు నిమజ్జనోత్సవం లో పాల్గొన్నారు. అంతేకాక గణపతి లడ్డులకు వేలం పాటలు కూడా అంతే జోరుగా కొనసాగాయి. ఇందులో భాగంగా మియాపూర్ లో లడ్దు వేలం పాట నిర్వహించగా.. పెద్ద లడ్దూ ను రూ. 2లక్షల 11 వేలకు కూన సత్యనారాయణ గౌడ్ కైవసం చేసుకున్నారు. లక్కీ లాటరీలో మరో లడ్దూను ఆర్ ఎల్ పి వెంకటేష్ పటెల్ దక్కించుకున్నారు.