బండి రమేష్ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని 9వ రోజున మియాపూర్, గచ్చిబౌలి డివిజన్లలో ఏర్పాటు చేసిన పలు మండపాలలో గణేశుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులకు భోజనం వడ్డించారు.

ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రార్థించారు. వినాయకుని నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను కోరారు ఈ కార్యక్రమంలో భక్తులు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here