శ్రీ ధర్మపురి క్షేత్రం లడ్డూ @ రూ.2,01,116… దక్కించుకున్న బండి రమేష్…

నమస్తే శేరిలింగంపల్లి: దీప్తి శ్రీనగర్ శ్రీ ధర్మపురి క్షేత్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. నిమజ్జనోత్సవంలో భాగంగా గురువారం లడ్డూ వేలంపాట ఉత్సాహంగా కొనసాగింది. పవిత్రమైన లడ్డును దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. మండపంలో స్వామివారితో పాటు పూజలందుకున్న మూడు లడ్డూలను వేలం వేయగా ప్రధాన లడ్డూను టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ వ్యాపారవేత్త బండి రమేష్ రూ.2,01,116 లకు దక్కించుకున్నారు.

కైవసం చేసుకున్న లడ్డుతో బండి రమేష్

మిగిలిన రెండు లడ్డులను విజయ్ కుమార్ రూ.51,000, గొట్టిపాటి గీతా శ్రీనివాస్ రూ.36,000 లకు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకురాలు భారతీయం సత్యవాణి మాట్లాడుతూ ఈ ఏడాది వినాయక నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా ముగిసాయని, అందుకు సహకరించిన భక్తులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

వేలంపాట విజేతలకు లడ్డూలను అందజేస్తున్న భారతీయం సత్యవాణి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here