- ఎంసిపిఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తుకారం నాయక్
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఏపూరి ఎర్ర సూర్యుడు, ఎంసిపిఐ వ్యవస్థాపకులు మద్ది కాయల ఓంకార్గా జీవితం భావితరాలకు ఆదర్శమని ఎంసిపిఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తుకారం నాయక్ అన్నారు. మియాపూర్ డివిజన్ పోగుల ఆగయ్య నగర్ లో కామ్రేడ్ కర్ర దానయ్య అధ్యక్షతన ఓంకార్ 14వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం సిపిఐయు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తుకారం నాయక్ మాట్లాడుతూ పేద ప్రజలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర ఎంసిపిఐ వ్యవస్థాపకుడు ఓంకార్ కు ఉన్నదని, సిపిఎం పార్టీలో సైద్ధాంతిక సిద్ధాంత పరంగా బయటకు వచ్చి 1984లో వరంగల్ లో ఎంసిపిఐ పార్టీ ఏర్పాటు చేసి ఐదుసార్లు నర్సంపేట ఎమ్మెల్యేగా ఎన్నికై ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో రెండున్నర గంటలు అనర్గళంగా మాట్లాడిన చరిత్ర ఆయనకు ఉన్నదన్నారు. కామ్రేడ్ ఓంకార్ 14వ వర్ధంతిని ఈ నెల 17 నుండి 31 వరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలతోపాటు డివిజన్ , గ్రామాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు, గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి కామ్రేడ్ మైథం శెట్టి రమేష్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కుంభం సుకన్య, నాయకులు తాండ్ర కళావతి, అనిల్ కుమార్, పల్లె మురళి, వై రాంబాబు, ఎం .రాములు, లక్ష్మణ్, బి. విమల, లావణ్య, సుల్తానా బేగం, శ్రీలత, కవిత పాల్గొన్నారు.
