నమస్తే శేరిలింగంపల్లి: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు మరో వివాదంలో చిక్కుకున్నారు. శ్రీధర్ రావు తనపై దాడికి పాల్పడునట్లు ఈవెంట్ మేనేజర్ భాస్కర్ రావు మంగళవారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే భాస్కర్ రావు తనపట్ల దురుసుగా ప్రవర్తించాడంటూ శ్రీధర్ రావు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే పలు కేసులు నమోదవగా తాజాగా ఈవెంట్ మేనేజర్ కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇరువురి ఫిర్యాదులపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






