ఇంటింటికి మంజీరా వచ్చేసింది

  • పూర్తైన పైపులైన్ పనులు.. మంచినీటి నల్లా కుళాయిని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: కొన్నెండ్లుగా పేదలు పడుతున్న ఇబ్బందులు నేటితో తొలిగిపోయాయి. ఒకప్పుడు నెలకొన్న తాగునీటి కొరతకు విముక్తి లభించింది. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సెంట్రల్ పార్క్ ఫేస్ 2, కాలనీలో… గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని లెజెండ్ మ్యారీగోల్డ్ విల్లాస్ లో మంజీర మంచినీటి పైప్ లైన్ పనులు పూర్తయిన శుభసందర్భంగా కాలనీ వాసులకు మంజీర మంచినీటి నల్లా కుళాయిని ఆయా డివిజన్ల కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు మంచినీటి పైప్ లైన్ వేసి నేడు మంజీర మంచినీటి కుళాయిని ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తీరిందని అన్నారు. ప్రజల దాహార్తిని తీర్చడం గొప్ప అనుభూతిగా భావిస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ , జర్నలిస్టు సంఘం నాయకులు కే శ్రీనివాస్ గౌడ్, పుట్ట వినయ కుమార్ గౌడ్ కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here