శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని గోపినగర్ లో స్థానికవాసులు కలుషిత నీటి సమస్యపై కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ దృష్టికి తీసుకురాగా తక్షణమే ఆయన సంబంధిత అధికారులతో కలిసి పర్యటించి సమస్య పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టి కలుషిత తాగునీటి సమస్యను పరిష్కరించారు. అనంతరం నెహ్రూనగర్, ప్రశాంతినగర్ కాలనీవాసులు డ్రైనేజీ లీకేజీతో ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. డ్రైనేజీలో చెత్త పేరుకుపోవడంతో బస్తీల్లో లీకేజీ సమస్య అధికమవుతున్నదన్నారు. దశలవారీగా మురుగునీటి లీకేజీ సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. దీన్ని అధిగమించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కలుషిత నీటి సమస్యలు అధికమవుతున్న నేపథ్యంలో శిథిలమైన మంచినీటి, డ్రైనేజీ పైపులైన్‌లను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన కొత్త పైపులైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. డ్రైనేజీ సమస్య తీరిన వెంటనే మిగిలిన సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతామని అన్నారు. అనంతరం రోడ్డుకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించమని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బందికి ఆదేశించారు. రోడ్డు వెడల్పు కోసం అడ్డుగా ఉన్న అరుగులను, ర్యాంపులను తొలగించాలని రోడ్డు వెడల్పు కోసం స్థానికవాసులు సహకరించాల్సిన అవసరం ఉందని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో HMWS, SB డిఈ నరేందర్ రెడ్డి, వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి, జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ భాస్కర్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, శ్రీకాంత్ దేవులపల్లి, నర్సింహా రెడ్డి, ప్రభాకర్, మహేందర్ సింగ్, రేణు, దస్తగిరి, స్వామి, మహేష్, ప్రభాకర్, మల్లేష్, విజయ్, శ్రీశైలం, కుమార్, అశోక్, వంశీ, సాయి, చంటి, స్వర్ణ, కాంత కుమారి, ప్రసన్న, పుష్ప, రాజమణి స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.