శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ 21 పరిధిలో మదినగూడ జాతీయ రహదారిపై మున్సిపల్ కార్మికుడు సెంట్రల్ డివైడర్ ను శుభ్రం చేస్తున్న సమయంలో బైక్ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే తోటి వర్కర్లు, ఎస్ ఎఫ్ ఏ మనోహర్ అర్చన ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మున్సిపల్ సంఘం డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కొమ్ము పరమేష్ హాస్పిటల్ కి వెళ్లి ప్రమాదానికి గురి అయిన వ్యక్తి ప్రసాద్‌ను పరామర్శించి మెరుగైన వైద్యం కోసం ఈఎస్ఐ హాస్పిటల్ సనత్ నగర్ కు 108 వాహనంలో తరలించారు.
రంగారెడ్డి జిల్లా ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఏఐటియుసి తరఫున జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ కు సెంట్రల్ డివైడర్ జిహెచ్ఎంసి కార్మికులతో శుభ్రం చేయించవద్దని అధికారులకు వివరించారు. కార్మికులు సెంట్రల్ డివైడర్ ఊడ్చుతున్న క్రమంలో ప్రమాదాలకు గురి అవుతున్నారని వినతి పత్రం ఇచ్చామన్నారు. ఈ సమస్యకు అధికారులు స్పందించి వెంటనే సెంటర్ డివైడర్లను గ్రేటర్ హైదరాబాద్ జాతీయ రహదారులన్నీ మిషన్లతో మాత్రమే శుభ్రం చేయించాలని ఆయన అన్నారు. కార్మికులకు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు ఇప్పటివరకు ఇంకా స్పందించడం లేదన్నారు. ఇలా నిర్లక్ష్యం చేస్తే రానున్న రోజులలో సర్కిల్ ఆఫీసులు, జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని అన్నారు. ప్రమాదం జరిగిన వ్యక్తిని సనత్ నగర్ కు పంపించే సమయంలో తోటి వర్కర్లు, ఎస్ఎఫ్ఐ మనోహర్, ఎఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కొమ్ము పరమేష్ తదితరులు ఉన్నారు.