శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రముఖ సాంస్కృతిక సంస్థ స్వరమహతి కళాపరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ సహకారంతో శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయస్వామి వారి దేవస్థానం ఎస్జిఎస్ ఆశ్రమం ఎల్ఐజి బిహెచ్ఎల్ లో నిర్వహించిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్య ఆరాధన ఉత్సవాల సంబరాలు మిన్నంటాయి. సుమారు 1000 మంది సంగీత నృత్య కళాకారులు ఆ తిరుమలేశునికి అన్నమయ్య పదాలతో నీరాజనాలను అర్పించారు. ప్రాంగణమంతా గోవింద నామ స్మరణతో ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. ఇంతమంది కళాకారులు స్వామి వారి మీద భక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమని, అన్నమాచార్య ప్రాజెక్టు టిటిడి పదిమంది కళాకారులని డిప్యూట్ చేసిందని సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు డాక్టర్ బంధనపూడి ఆదిత్య కిరణ్ అన్నారు.

ఈ సందర్భంగా అన్నమయ్య పదకోకిల పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభ రాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకమని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థ సభ్యుల్ని గురువుల్ని అభినందించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఈవి శ్రీనివాస్, రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ కిరణ్మయి, టీజీవో అసోసియేషన్ సెక్రటరీ ఐ అండ్ పిఆర్ డిపార్ట్మెంట్, యక్షగాన కంటిరవా పసుమర్తి శేషు బాబు, తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఉదయ భాస్కర్, సరస్వతి ప్రసాద్, పాండురంగారావు, నరసింహం, భరద్వాజ, సాయి పద్మజ, రామదుర్గం నగేష్, ప్రముఖ కాపు నేత అరవ రామకృష్ణ, సామాజికవేత్త దరిశ రామ్మోహన్, డాక్టర్ శ్రీనివాస వరప్రసాద్, సంధ్యాదేవి, భరత వేద ఆర్ట్స్ అకాడమీ, దేవులపల్లి కుమార్, భారతీ నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి, నటరాజ్ గుప్తా,శివరామకృష్ణ, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.







