నేతాజీ నగర్ కాలనీలో ఘ‌నంగా శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ అమ్మ‌వార్ల ఉత్స‌వాలు

శేరిలింగంప‌ల్లి, జూలై 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నేతాజీ నగర్ కాలనీలో శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ అమ్మవార్ల‌ ఒడిబియ్యం అన్న ప్రసాదం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాల‌నీ అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢ‌ మాసం బోనాల పండుగ సందర్భంగా రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ అమ్మవార్ల‌కి భక్తులు సమర్పించిన ఒడి బియ్యం ప్రసాదం నైవేద్యం అన్నప్రసాద కార్యక్రమం వండి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి తదుపరి భక్తులకు పెద్ద ఎత్తున అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించడం జ‌రుగుతుంద‌న్నారు. ఇందులో భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అన్న తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షుడు రాయుడు, సాయి ఫోటో స్టూడియో వెంకటేష్ ముదిరాజ్, భేరి చంద్రశేఖర్ యాదవ్, తెలుగు సుభాష్ ముదిరాజ్, జై మాతా కిరాణా షాప్ ప్రొప్రైటర్ శంకర్ మార్వాడి, హోటల్ వేలు, ఎన్ ఎన్ రెడ్డి టెక్స్టైల్స్ బోటిక్ మెన్స్ షాప్ ప్రొప్రైటర్ కుషన్ రెడ్డి, మౌలానా, రవి నాయక్, నరేష్ నాయక్, సురేష్ నాయక్, సత్తెమ్మ, మణిమేఘల, జయ రెడ్డి, అంజిరెడ్డి, రాధా రాణి రెడ్డి, చిట్టెమ్మలాల్ రెడ్డి, పుష్ప రెడ్డి, చంద్రకళ, ప్రసాదు చారి రాణి, యూత్ ప్రెసిడెంట్ డీజే భవన్, అశోక్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here