శేరిలింగంపల్లి, జూలై 21 (నమస్తే శేరిలింగంపల్లి): న్యూ ఢిల్లీలో ఈ నెల 20, 21 తేదీలలో జరగనున్న రాజకీయ శిక్షణ తరగతుల కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి మహిళ కాంగ్రెస్ నేతలు శనివారం ఉదయం న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కాలంబ, రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావు ఆధ్వర్యంలో జరిగిన తరగతులల్లో పాల్గొన్నారు. దాదాపు 100 మందికి పైగా మహిళా నాయకురాళ్ళు తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్నారని సునీతా రావు తెలిపారు. ఇందులో శేరిలింగంపల్లి నియోజకవర్గనికి సంబంధించిన మహిళ అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్ తో పాటు పార్వతి, శాంత, సంగీత, జయ, కవిత, యు.శాంత పాల్గొన్నారు.






