శేరిలింగంపల్లి, జూలై 21 (నమస్తే శేరిలింగంపల్లి): భారతి నగర్ డివిజన్ పరిధిలోని MIG కాలనీలో బోనాల ఉత్సవాలలో భాగంగా మణికంఠ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, సీనియర్ నాయకుడు ఆదర్శ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా ప్రజలందరికి బోనాల పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని అన్నారు. అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నాను అని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వాడవాడలా బోనాల జాతర వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో నియోజకవర్గంలోని ప్రతి ఆలయానికి బోనాల నిధులు మంజూరయ్యేలా కృషి చేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, ఆదర్శ్ రెడ్డి, భాస్కర్ , ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, జగన్నాథ్ రెడ్డి , రాకేష్, కాజా తదితరులు పాల్గొన్నారు.






