శేరిలింగంపల్లి, జూలై 21 (నమస్తే శేరిలింగంపల్లి): అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఆషాడం సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ లోని తారానగర్ శ్రీశ్రీశ్రీ తుల్జా భవాని అమ్మవారి ఆలయం నుండి ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి శాసనసభ్యుడు ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు, యువకుల నృత్యాలతో ఉత్సాహంగా ఊరేగింపు సాగింది.