శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ లో బోనాల ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన ఫలహారం బండి కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వాడవాడలా బోనాల జాతర వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో నియోజకవర్గంలోని ప్రతి ఆలయానికి బోనాల నిధులు మంజూరయేలా కృషి చేశానని తెలిపారు. బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకునేలా బోనాలు నిర్వహించుకొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాని అన్నారు. బోనాల సందర్భంగా ప్రతి ఆలయం వద్ద అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.