శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ లో బోనాల ఉత్సవాలలో భాగంగా సహదేవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని మతాల వారు అంగరంగా వైభవంగ పండుగలను జరుపుకునేలా కృషి చేస్తున్నారు అని అన్నారు. తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళుతున్నారని PAC చైర్మన్ గాంధీ కొనియాడారు. బోనాల సందర్భంగా ప్రతి ఆలయం వద్ద అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతులు కల్పిస్తూ ప్రశాంత వాతావరణం కల్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






