నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు మహమ్మద్ జమీర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి .జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీ పథకం ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.