- ఆయా ప్రాంతాల్లో పర్యటన
- సమస్యలను పరిష్కరించాలని అధికారులకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ విన్నపం
నమస్తే శేరిలింగంపల్లి: గత రెండు రోజులుగా పడుతున్న వర్షాలకు లింగంపల్లి అండర్ పాస్ బ్రిడ్జి నీట మునిగింది. ఇందిరా నగర్ కాలనీలో వరద నీరు చేరింది. ఆయా ప్రాంతాలను బీజేపీ శ్రేణులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పర్యటించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా వర్షాలు పడిన ప్రతిసారీ లింగంపల్లి అండర్ బ్రిడ్జి నీటిలో మునగడం, జనాల రాకపోకలకు ఇబ్బంది కలగడం షరా మామూలు అయిపోయిందని అన్నారు. గడిచిన తొమ్మిది ఏళ్లలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాకపోకలకు ఇబ్బంది లేకుండా మరమ్మత్తు చర్యలు చేపట్టకుండా నియోజకవర్గంలో చెరువులు, నాళాలు కుంటలు ఎక్కడకక్కడ కబ్జాకు గురై తేలికపాటి వర్షానికే కాలనీలోకి నీరు వచ్చేసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైనా నాలాలపై దృష్టి సాధించి తగిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి, ఎల్లేష్, రమేష్, జగదీష్, శ్రీకాంత్ యాదవ్, నరసింహ, మఖన్ సింగ్ ,రమేష్ రెడ్డి, కరణ్ గౌడ్, అఖిల్, బాలరాజ్ మొదలవారు ఉన్నారు.