నమస్తే శేరిలింగంపల్లి: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపునీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లడంతో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ వెంటనే స్పందించి అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద నిలిచిన వర్షపు నీటిని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సిబ్బంది సహకారంతో తొలగింపు చేయుటకు శాయశక్తులా పనిచేస్తున్నారు.
ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సమస్య వాహనాల రాకపోకలు త్వరితగతిన సాఫీగా సాగేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారితోపాటు రవీంద్ర రాథోడ్ తదితరులు ఉన్నారు.