లింగంపల్లి విలేజ్ లో బడిబాట

  • ఎంఈవో వెంకటయ్య కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
  • జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధి లింగంపల్లి విలేజ్ లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, మండల ప్రాథమిక పాఠశాలలో బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో వెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థిని, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ పాఠశాలలు బుధవారం తెరచుకోనున్నాయని, 6న ప్రారంభమైన ‘బడిబాట’ కార్యక్రమం 19వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.

జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు బడిబాట పట్టనున్నారని, తొలిరోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులందరికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫారాలు అందజేస్తున్నామని, 1వ తరగతి నుండి 5 తరగతి వరకు విద్యార్థులకు ఉచిత వర్క్‌షీట్‌లు, పుస్తకాలు – 6వ తరగతి నుండి 10 తరగతి విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్‌లు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ లు పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో అవసరమైన మరమ్మతు పనులను దాదాపు పూర్తి చేశామని, తరగతి గదులను అలంకరించి, ప్రవేశ ద్వారాలకు మామిడి తోరణాలు కట్టి పండగ వాతావరణంలో విద్యార్థులకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసినట్లు చెప్పుకొచ్చారు.


ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శైలజ, భీమయ్య, మహేందర్ , శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చింత కింది రవీందర్ గౌడ్, ప్రసాద్ పద్మారావు, పొడుగు రాంబాబు, కొండల్ రెడ్డి, లింగం శ్రీనివాస్, రమేష్, వేణు గోపాల్ రెడ్డి, నటరాజ, రవి యాదవ్, రమణయ్య, గోవిందా చారి, అహ్మద్, అజాం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here