శేరిలింగంపల్లి, డిసెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సురభి కాలనీలో ఇటీవల జరిగిన సురభి కళాకారుల సంక్షేమ సంఘం ఎన్నికల్లో భాగంగా నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరయ్యారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ.. అసోసియేషన్ సభ్యులను ఉద్దేశించి నూతనంగా ప్రెసిడెంట్ లుగా ఎన్నికైన శేఖర్, వెంకట్ రెడ్డి, కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాలనీ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు జవాబుదారీగా పని చేస్తున్నట్లు తెలిపారు. అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు సీసీ రోడ్డు, ప్లే గ్రౌండ్ లో ఐమాస్ లైట్ తదితర డిమాండ్ లను సానుకూలంగా స్పందిస్తూ శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సురభి కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎస్ఏ చంద్రశేఖర్, ఆర్ వెంకట్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ జయ కృష్ణ, సెక్రటరీ వెంకట భాను, జాయింట్ సెక్రటరీ జితేందర్ రెడ్డి, ట్రెజరర్ సుధ, సలహాదారులు సుబ్బారావు, ఆర్ కోదండరావు, మాజీ సెక్రటరీ రమణ కుమార్, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.