శేరిలింగంపల్లి, డిసెంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): బుడిబుడి అడుగులు వేస్తూ పాఠశాలలో చేర్చాక వారి భవిష్యత్తు గురించి ఉపాధ్యాయులతోపాటు తలిదండ్రులకు మరింత బాధ్యత పెరుగుతుందని సామాజిక కార్యకర్త జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. లిటిల్ బడ్డీ ప్రీస్కూల్ చందానగర్ వార్షిక దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాటాడుతూ వివేకానంద, భగత్ సింగ్ లు మన పక్క ఇంట్లో కాకుండా మన ఇంట్లో పుట్టాలనే మానసిక దృఢత్వం తలిదండ్రుల్లో రావాలని అంటూ వారిలో ఉన్న నైపుణ్యాన్ని చిన్నప్పటినుండే వెలికి తీయాలని కసిరెడ్డి భాస్కరరెడ్డి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వివిధ పోటీల్లో విజయం సాధించిన చిన్నారులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులను అందించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్వాతి విద్యాసాగర్ పూట్ల, విద్యాసాగర్, సింగం ప్రమీల, శ్రవంతి మీసాల, వీణా నార తదితరులు, చిన్నారుల తలిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.