శేరిలింంగపల్లి, జూన్ 9 (నమస్తే శేరిలింంగపల్లి): శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని ఎలక్షన్ కమిషన్ కార్యాలయం వద్ద ఏర్పడిన వాటర్ లాగింగ్ ప్రాంతాన్ని జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, ఉప కమిషనర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో కలిసి మంగళవారం పరిశీలించారు. తనిఖీ సందర్భంగా ఖాజాగూడ చెరువులోకి వర్షపు నీరు సజావుగా వెళ్లేందుకు అడ్డంకిగా మారిన సమస్యను అధికారులు గుర్తించారు. వెంటనే స్పందించిన అధికారులు హిటాచీ ఎక్స్కవేటర్ సహాయంతో అడ్డంకులను తొలగించి నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించే పనులు చేపట్టారు. వర్షపు నీరు వేగంగా బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవడంతోపాటు, స్థానిక ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో వర్షాకాల పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, అవసరమైన ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకుంటామని జోనల్ కమిషనర్ పేర్కొన్నారు.






