శేరిలింగంపల్లి, డిసెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బొటానికల్ గార్డెన్స్ లో కొండాపూర్ కమ్మసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్మ సంఘం కార్తీక మాస వన భోజన మహోత్సవం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మన్నే సతీష్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబులతో కలిసి PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రగతి నగర్‌లో..
ప్రగతి నగర్ లోని మిథుల నగర్ లో కమ్మ సేవా సమితి ప్రగతి నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్మ సంఘం 15 వ కార్తీక మాస వన భోజన మహోత్సవం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మన్నే సతీష్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబులతో కలిసి PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస దాసు, అడుసుమిల్లి వెంకటేశ్వర రావు, చంద్రమౌళి, పాతూరి వెంకట్ రావు, కొల్లి వెంకటేశ్వర్లు, కల్యాణ చక్రవర్తి, ప్రభాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.