మియాపూర్ సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు: ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూన్ 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్‌లో ముఖ్యమంత్రి Revanth Reddy పాల్గొన్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పీఏసీ చైర్మన్ Arekapudi Gandhi పేర్కొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సుమారు రూ.2వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న మియాపూర్ చౌరస్తా ఫ్లైఓవర్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ప్రధాన కార్యాలయం సహా పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి హాజ‌రైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరఫున స్వాగతం తెలుపుతున్నట్లు చెప్పారు. సభ విజయవంతం కోసం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన తాజా మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ‌లు, అధికారులు అందరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి తనపై విశ్వాసం ఉంచిన శేరిలింగంపల్లి ప్రజల రుణం ఎప్పటికీ తీర్చలేనిదని గాంధీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. ప్రజల సంక్షేమం, సమగ్ర సంతులిత అభివృద్ధే తన ధ్యేయమని, ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతామని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ స్పష్టం చేశారు. TUFIDC చైర్మన్ చల్లా నర్సింహ రెడ్డి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here