సీఎంసీ పరిధిలో మున్సిపల్ కార్మికుల సమస్యల‌ను పరిష్కరించాలి: సీఐటీయూ డిమాండ్

శేరిలింంగ‌ప‌ల్లి, జూన్ 9 (న‌మ‌స్తే శేరిలింంగ‌ప‌ల్లి): సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ (సీఎంసీ) పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీల నుంచి సీఎంసీలో విలీనమైన మియాపూర్, శేరిలింగంపల్లి, అమీన్‌పూర్, రామచంద్రాపురం, బాచుపల్లి, నిజాంపేట్, దుండిగల్, గుండ్లపోచంపల్లి, గండిమైసమ్మ, మేడ్చల్, కూకట్‌పల్లి ప్రాంతాలకు చెందిన కార్మికులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కార్మికులకు గతంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో అమలవుతున్న వేతనాలను వర్తింపజేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలను పటిష్టంగా అమలు చేయాలని వారు కోరారు. అలాగే మరణించిన కార్మికులకు రూ.50 వేల అంత్యక్రియల ఖర్చులు అందించాలని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్ల సాధన కోసం కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం తమ వినతిపత్రాన్ని సీఎంసీ డిప్యూటీ కమిషనర్‌కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కొంగరి కృష్ణ, నాగేశ్వరరావు, అశోక్, రాజశేఖర్, లింగస్వామి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here