– దేశంలోనే మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆస్పత్రిలో మొదటిసారి
నమస్తే శేరిలింగంపల్లి: స్త్రీ జననేంద్రియాల శస్త్రచికిత్స చేయాలంటే ఒకప్పుడు ఒపెన్ సర్జరీలే దిక్కు. శస్త్రచికిత్స తాలూకా గుర్తులు జీవితాంతం కనిపచడం, శస్త్రచికిత్స తరువాత కోలుకోవడానికి చాలా రోజుల సమయం పట్టేది. ఈ తరహా శస్త్రచికిత్సలలోని కష్టాలను తగ్గిస్తూ ల్యాప్రోస్కోపిక్ ఆ తరువాత రోబోటిక్ ల్యాప్రోస్కోపిక్ చికిత్సలు వచ్చాయి. అయినప్పటికీ శస్త్ర చికిత్స తాలూకా చిన్న గాయాలు కనిపిస్తూనే ఉంటాయి. అసలు ఆపరేషన్ అయిన గుర్తులే లేకుండా చికిత్స చేయడం సాధ్యం కాదా అని అంటే ఇప్పుడు సాధ్యమే అంటున్నారు మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ డాక్టర్లు. హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్‌లో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వినోట్స్ సాంకేతికతను పరిచయం చేశారు. ఈ సాంకేతికతతో రోగులకు అపార ప్రయోజనాలూ ఉంటాయి. మరీ ముఖ్యంగా పొట్టమీద అసలు కోత తాలూకా గుర్తులే కనిపించవు సరికదా, నొప్పిలేని శస్త్ర చికిత్సగా కూడా ఇది నిలుస్తుంది. అంతేనా, శస్త్ర చికిత్స తరువాత హాస్పిటల్‌లో ఉండాల్సిన సమయం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. మహిళల కోసం అందుబాటులోకి వచ్చిన ఈ మినిమల్లీ ఇన్వాసివ్ శస్త్రచికిత్స గురించి మెడికవర్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ అనిల్ మాట్లాడుతూ దాదాపుగా ల్యాప్రోస్కోపీకి అయ్యే ఖర్చుతోనే ఈ చికిత్స చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం అందుబాటులోని అత్యాధునిక గైనకలాజికల్ చికిత్సవిధానాలలో ఇది ఒక చికిత్స అని అన్నారు. త్వరలోనే ఈ చికిత్స ప్రక్రియకు సంబంధించి ఫెలోషిప్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. సర్జికల్, గైనకాలజికల్ కమ్యూనిటీకి శిక్షణ అందించనున్నామని మెడికవర్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌లో వీనోట్స్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ వింధ్య జి మాట్లాడుతూ ఈ సాంకేతికతను తొలుత 2004లో కనుగొన్నారని, అయితే యూరోప్‌లో తొలిసారి 2012 అనంతరం యూఎస్‌లో 2018లో దీనిని ఉపయోగించడం ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఈ చికిత్సను చేయడం ప్రారంభించిన మొట్టమొదటి ది మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ అన్నారు. 2020 నుంచి ఈ చికిత్సలను తాను చేస్తున్నట్టు వివరించారు. దాదాపు 50 మందికి పైగా రోగులలో సంతృప్తికరమైన ఫలితాలను చూశానని చెప్పారు. ఈ చికిత్సతో ఆపరేషన్ తాలూకా గీతలు కనిపించవని, ఊబకాయులు సహా ఎవరికైనా సరే ఇది అనువుగా ఉంటుందన్నారు. నొప్పి తక్కువ, హాస్పిటల్‌లో గడపాల్సిన సమయమూ తక్కువగా ఉంటుందని చెప్పారు. రక్తం పోవడం వంటి సమస్యలు దాదాపుగా కనిపించవని అన్నారు.
అనస్తీషియా డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ సుకేష్ మాట్లాడుతూ రోగులకు మెరుగైన ప్రయోజనాలతో పాటు ఇతర అనస్తీషియా సంబంధిత సమస్యలు కూడా నివారించడం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ అనిల్, డియంఎస్ సంగీత పాల్గొన్నారు.