దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జాతీయవాది డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

నమస్తే శేరిలింగంపల్లి: జాతీయ ఐక్యతను కాపాడేందుకు జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలో పూర్తిగా ఏకీకృతం చేయడానికి అవిశ్రాంతంగా పోరాడిన గొప్ప దేశభక్తుడు, దేశం కోసం ప్రాణత్యాగం ‌చేసిన జాతీయ వాది, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ శ్యాం ప్రసాద్ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు‌ జ్ఞానేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఆల్విన్ చౌరస్తాలోని బీజేపీ కార్యాలయం వద్ద జనసంఘ్ వ్యవస్థాపకులు డా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమం హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు ఆద్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని డాక్టర్ శ్యాం ప్రసాద్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మాజీ మంత్రి శ్యాం ప్రసాద్ నిష్ణాతుడైన న్యాయవాది, తత్వవేత్త, గొప్ప పేరున్న విద్యావేత్త అని అన్నారు. కలకత్తా విశ్వవిద్యాలయానికి అతి పిన్న వయస్సులో ఛాన్స్ లర్ గా, స్వతంత్ర భారతదేశపు మొదటి పరిశ్రమ, సరఫరా మంత్రిగా దేశానికి సేవ చేశారని గుర్తు చేశారు. మాతృభూమిపై ఆయనకున్న ప్రేమ ప్రతి భారతీయుడికి ఎప్పుడూ ప్రేరణగా ఉంటుంది అని అన్నారు. కాశ్మీర్ విషయంలో ఆయన కన్న కలల్ని ఇవాళ భారత ప్రధాని మోదీ నిజం చేశారన్నారు. జాతీయ పార్టీ పిలుపు మేరకు మొక్కలను నాటే కార్యక్రమంలో భాగంగా జన ప్రియ నగర్, హఫీజ్ పెట్, ప్రజసిటీ,ఆల్విన్ కాలనీ, సప్తగిరి కాలనీ తో పాటు తదితర ప్రాంతాల్లో కార్యకర్తలు,‌నాయకులతో కలిసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కోటేశ్వరరావు, వర ప్రసాద్, శ్రీనివాస్ యాదవ్, ఆకుల లక్ష్మణ్, పాపయ్య,రాజా రత్నం, పృథ్వి కాంత్, బాబు, అంజయ్య, యాదగిరి, నర్సింహ, జానీ, శ్రీకర్, లక్ష్మా రెడ్డి, రమణరావు, రవీందర్, కొండా రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ‌చిత్రపటానికి పూలమాల‌ వేసి నివాళి అర్పిస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here