నమస్తే శేరిలింగంపల్లి: పొట్టకూటికోసం నగరానికి వలస వచ్చి కూలీగా పనిచేస్తున్న యువకుడు అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బీహార్ రాష్ట్రం ఆరాన్ సహార్స, ఆరాన్ వార్డుకు చెందిన అక్తర్(19) నగరానికి వలస వచ్చాడు. నలగండ్ల ప్రాంతంలో నివాసముంటూ ఐఆర్టీ కంపెనీలో కూలీ గా పనిచేస్తున్నాడు. కాగా అక్తర్ ఈ నెల 4వ తేదీ నుండి కనిపించకపోవడంతో అతని బంధువు ఇర్ఫాన్ చందానగర్ పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.