మియాపూర్, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శనివారం ఆయన నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ డివిజన్ ప్రశాంత్ నగర్ కాలనీలో ఉన్న ఏలియన్ ఎలైట్స్ అపార్ట్మెంట్స్లో ప్రతిష్టించిన గణనాథున్ని స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు వినాయకుడు అని, అందుకే ఆయన్ను విఘ్నేశ్వరుడు అంటారని, ఎంతోమంది దేవుళ్లు ఉన్నప్పటికీ మొదట పూజలు అందుకునేది ఆయనే కాబట్టి ఆదిదేవుడుగా కొలుస్తారని అన్నారు.
ఏనుగు తల, మనిషి శరీరం కలిగి ఉండి ఒకే దంతం కలిగి ఉండటంచేత ఏకదంతుడిగా కీర్తించబడుతున్నాడని అన్నారు. ప్రజలందరూ సంతోషకరమైన వాతావరణంలో పండుగ ఉత్సవాలను జరుపుకోవాలని అన్నారు. మండపాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మారబోయిన రాజు యాదవ్, ప్రసాద్, మల్లేష్ యాదవ్, మల్లేష్ గౌడ్, సీహెచ్ రాజు యాదవ్, పవన్, ఏలియన్స్ ఎలైట్స్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సభ్యులు డింపి గోయల్, షమీ పౌల్, మాణిక్యం గౌడ్, కృష్ణ కూచిపూడి, ప్రవీణ్, సప్త రిషి, ఏఎస్ నారాయణ, సుమంత్, రాజన్ కుమార్, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.