శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం ఆయన మియాపూర్ డివిజన్ పరిధిలోని కృషి నగర్, కృషి నగర్ నుండి దీప్తి శ్రీ నగర్ కనెక్టివిటీ రోడ్డు, శ్రీ లక్ష్మీ వెంకట నగర్ కాలనీ నుండి మక్తా మహబూబ్ పేట్ కనెక్టివిటీ రోడ్డు, శ్రీల గార్డెన్స్ కాలనీ, శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలలో రూ.1.53 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. మియాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరం అని, మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని అన్నారు. సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కోసం శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.
కృషి నగర్ కాలనీలో రూ.57 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మాణం చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, కృషి నగర్ నుండి దీప్తి శ్రీనగర్ కనెక్టివిటీ రూ.17 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మాణం చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, శ్రీ లక్ష్మీ వెంకట నగర్ కాలనీ నుండి మక్తా మహబూబ్ పేట్ కనెక్టివిటీ రూ.37 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, శ్రీలా గార్డెన్ కాలనీలో రూ.20 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మాణం చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో రూ.22 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మాణం చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.