శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): పర్యావరణ పరిరక్షణకు మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలనే ఉపయోగించాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ సూచించారు. శుక్రవారం ఆయన నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను అందరూ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గణేష్ ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేయాలన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని విశ్వేశ్వరయ్య కాలనీలో యూత్ కాంగ్రెస్ నాయకుడు నితిన్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక డివిజన్ నాయకులతో కలిసి జగదీశ్వర్ గౌడ్ ప్రజలకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సౌందర్య రాజన్, నితిన్ గౌడ్, ప్రవీణ్, కిషోర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో..
ఆల్విన్_కాలనీ డివిజన్ పరిధిలోని జలకన్య కాలనీలో అల్విన్ కాలనీ ఫేజ్-2 కాలనీ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక డివిజన్ నాయకులు, నియోజకవర్గ నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వర రావుతో కలిసి జగదీశ్వర్ గౌడ్ మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మరేళ్ల శ్రీనివాస్ రావు, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఇస్మాయిల్, పట్వారీ శశిధర్, నవీన్ రెడ్డి, రెహ్మాన్, రవి, వాసు, సంగమేష్, మౌలానా, స్వరూప్, రూబెన్, శివ, లింగం, రమేష్, ప్రభాకర్, లింగం, షాహిద్, బాజిబాబు, శ్రీనివాస్ గౌడ్, హరనాథ్ గౌడ్, ప్రసాద్, శ్రీనివాస్, రమేష్, వెంకట్ రమణ, మహిళలు సత్తుర్ శిరీష, దుర్గ, లహరి, డివిజన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మాదాపూర్‌లో..
మాదాపూర్ డివిజన్ వార్డ్ కార్యాలయంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి జగదీశ్వర్ గౌడ్ మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు గోపాల్ నాయక్, వెంకట్రామిరెడ్డి, మహేష్ ముదిరాజ్, సర్దార్, ప్రవీణ్, సురేష్, రాజేష్, కృష్ణ, వినయ్ తదితరులు పాల్గొన్నారు.