శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని నల్లగండ్ల లక్ష్మీ విహార్ ఫేజ్ 2 లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్ లు శనివారం తమ స్వగృహంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ప్రత్యేక అలంకరణలో ఉన్న వినాయకుడిని ప్రతిష్టించి వేద పండితులచే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులను అందించాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని విఘ్నేశుడిని ఈ సందర్భంగా రాగం దంపతులు వేడుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్ పాల్గొన్నారు.