మయూరీనగర్ లో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

మయూరి నగర్ లో నిర్వహించిన పట్టణ ప్రగతిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి:  మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను స్థానికుల ద్వారా తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సంబంధిత‌ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి‌ సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణ ప్రగతి‌లో భాగంగా సోమవారం మయూరీ నగర్ లో స్థానిక‌ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అధికారులు, స్థానికులతో కలిసి పర్యటించారు. కాలనీ లో రోడ్లు, డ్రైనేజి సమస్యల తో పాటు పారిశుద్య పనులు తదితర అంశాలపై అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లకిరువైపులా ఉన్న మట్టి‌ కుప్పలను, చెత్తా చెదారాన్ని శానిటేషన్ సిబ్బందితో తొలగింపజేశారు. ప్రజా ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత దృష్ట్యా పట్టణ ప్రగతిని నిర్వహించడంజరుగుతుందన్నారు. స్థానికంగా ఏవైనా సమస్యలు‌ ఉంటే ప్రజలు తమ దృష్టికి తీసుకు రావాలని ఉప్పలపాటి‌ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిశోర్, సోమేశ్వర్ రెడ్డి, సురేష్, హరి, శ్రీకాంత్, రాజేశ్వరి రెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here