నమస్తే శేరిలింగంపల్లి: మూడవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సోమవారం చందానగర్ డివిజన్ శుభోదయ కాలని, సత్య ఏన్ క్లేవ్, అర్జున్ రెడ్డి, డిఫెన్స్ కాలని, విద్యానగర్ కాలనీలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖా అధికారులతో కలిసి పాల్గొన్న కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలలో నెలకొన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలలో పేరుకుపోయిన వ్యర్థలను తొలగించడం తో పాటు, నాలాల్లో పూడిక తీత పనులు చేపట్టారు.
అనంతరం కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ వాసులు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజల సహకారంతో పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, టీఎస్ ఐపాస్, టీఎస బిపాస్, హరితహారం, పల్లె ప్రగతి వంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చారన్నారు. పేద ప్రజలకు ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు వంటి సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ నాయకత్వంలో చందానగర్ డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథరెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు ఏఈ అనురాగ్, జలమండలి జీఎం సునిత, ఎలక్ట్రికల్ ఏఈ రాజు, శానిటేషన్ విభాగం అధికారులు బాలాజీ, శ్రీనివాస్, టిఆర్ఎస్ నాయకులు లక్ష్మినారాయణ గౌడ్, జనార్ధన్ రెడ్డి, ఓ.వేంకటేష్, అక్బర్ ఖాన్, దాసు, ధనలక్ష్మి, కోండల్ రెడ్డి, యశ్వంత్, అమంజద్ పాషా, భవాని చౌదరి, వరలక్ష్మి, పార్వతి, తదితరులు పాల్గొన్నారు.